Bapatla: బాపట్ల జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి
Bapatla: సూర్యలంక బీచ్ చూసేందుకు వచ్చి ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో మరణించారు.
Bapatla: బాపట్ల జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి
Bapatla: సూర్యలంక బీచ్ చూసేందుకు వచ్చి ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో మరణించారు. గుంటూరు జిల్లాకి చెందిన యువకులు సూర్యలంక బీచ్ చూసేందుకు బాపట్లకి బైక్‌లపై వచ్చారు. బీచ్‌లోకి బైక్‌లకి అనుమతి లేదని చెప్పడంతో... తిరిగి వెళ్లిపోయారు. తిరుగు ప్రయాణంలో బాపట్లలోని గడియారం స్తంభం సెంటర్ వద్ద అతివేగంగా వెళ్లి లారీని ఢీకొట్టారు. ప్రమాదంలో గుంటూరుకి చెందిన ఇద్దరు యువకులు ఎస్కే జాన్, నానిలు అక్కడికక్కడే మరణించారు. ఘటనపై బాపట్ల పోలీసులు కేసునమోదు చేసి విచారణ చేపట్టారు.