డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కుటుంబంలో విషాదం
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మైనారిటీ సంక్షేమ శాఖా మంత్రి అంజాద్ బాషా కుటుంబంలో విషాదం నెలకొంది.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మైనారిటీ సంక్షేమ శాఖా మంత్రి అంజాద్ బాషా కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన మామ, ప్రముఖ వ్యాపారవేత్త మహమ్మద్ హనీఫ్ మృతిచెందారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మహమ్మద్ హనీఫ్ ఆదివారం తుదిశ్వాస విడిచారు. మామ మహమ్మద్ హనీఫ్ పార్దీవ దేహం వద్ద డిప్యూటీ సీఎం, ఆయన కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. 80 ఏళ్ల వయసులోనూ కడప నగరం మునిసిపల్ కౌన్సిలర్‌గా ఆయన సేవలందించారు. వైసీపీ ఆరంభం నుంచి జిల్లా పార్టీలో కీలకంగా వ్యవహరించారు.
హనీఫ్ మృతి పట్ల పలువురు వైసీపీ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. కాగా మామ రాజకీయ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నారు అంజాద్ బాషా. వైయస్ఆర్ కు శిష్యుడిగా ఉన్న అంజాద్ బాషా 2009 లో కడప మునిసిపల్ కార్పొరేషన్ నుండి కార్పొరేటర్‌గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆ తరువాత 2014 ఎన్నికలలో 30,000 మెజారిటీతో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో కూడా కడప నియోజకవర్గం నుండి 50,000 కి పైగా మెజారిటీతో గెలిచారు.