AP School Tragedy: స్కూల్‌లో స్లాబ్‌ పెచ్చు ఊడిపడి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు మృతి

AP School Tragedy: అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో విషాదం చోటుచేసుకుంది.

Update: 2025-11-21 09:30 GMT

AP School Tragedy: అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం స్లాబ్‌ పెచ్చులు ఊడిపడి టీచర్‌ మృతి చెందిన ఘటన.. స్థానికంగా విషాదాన్ని నింపింది. రాజానగరం జెడ్పీ హైస్కూల్‌లో ఈ ఘటన జరిగింది. స్కూల్‌లో ప్రేయర్‌ అనంతరం.. నిర్మాణంలో ఉన్న భవనం పక్కన నిల్చుని ఉన్న ఇంగ్లీష్‌ టీచర్‌ జోష్నా భాయ్‌పై ప్రమాదవశాత్తు స్లాబ్‌ పెచ్చులు ఊడిపడ్డాయి.

ఈ ఘటనలో టీచర్‌కు తలకు తీవ్రగాయం కావడంతో హుటాహుటిన ఆమెను తుని ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో టీచర్‌ మృతి చెందారు. దీంతో స్కూల్‌లో విషాదఛాయలు అలుముకున్నామి. మృతురాలి స్వస్థలం కాకినాడ జిల్లా తునిగా తెలుస్తోంది.

Tags:    

Similar News