కోనసీమలో విషాదం.. టీచర్ వేధింపులతో బాలిక ఆత్మహత్య
కోనసీమ జిల్లా రామచంద్రపురంలో విషాదం భాష్యం స్కూల్లో 5వ తరగతి చదువుతున్న చిర్రహాని రంజిత ఆత్మహత్య టీచర్ వేధింపులే కారణమని తెలిపిన స్థానికులు
కోనసీమలో విషాదం.. టీచర్ వేధింపులతో బాలిక ఆత్మహత్య
అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో విషాదం చోటుచేసుకుంది. భాష్యం స్కూల్లో 5వ తరగతి చదువుతున్న చిర్రహాని రంజిత అనే బాలిక చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పాఠశాలలో పని చేస్తున్న టీచర్ ఉపాధ్యాయుని వేధింపుల తళాలేక ఆత్మహత్య చేసుకుందని స్థానికులు తెలిపారు. మృతురాలి తల్లి సునీత రామచంద్రపురం ఏరియా ఆసుపత్రిలో నర్స్‌గా పని చేస్తున్నారు. ఘటనపై రామచంద్రపురం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.