ట్రాఫిక్ పోలీసులు చేతివాటం.. సీజ్ చేసిన బైక్ ఇవ్వలంటే..

Update: 2020-05-09 09:23 GMT

కర్నూలు జిల్లా ట్రాఫిక్ పోలీసులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. లాక్ డౌన్ ఎరగా చూపి అందిన కాడికి దోచుకుంటున్న కర్నూలు జిల్లా ట్రాఫిక్ పోలీసులు. సీజ్ చేసిన బైక్ ఇవ్వలంటే 15 లీటర్ల డీజిల్ కోట్టించాలని డిమాండ్ చేసినట్లు బందువు బైక్ సీజ్ చేయడం తో విడిపించేందుకు వచ్చిన ఓ కానిస్టేబుల్ కర్నూలు ట్రాఫిక్ ఎస్సై కిరణ్ పై ఆరోపణలు చేశారు.

లాక్ డౌన్ నిబంధనలు ప్రకారం బండి సీజ్ చేస్తే ఫైన్ వెయ్యాలి కానీ ఇలా డీజిల్ అడగటo ఏంటని కానిస్టేబుల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న తన పట్ల ఈ విదంగా వ్యవహరిస్తే ఇక సామాన్య ల పరిస్థితి ఏంటని కానిస్టేబుల్ తమ గోడు వెళ్లబోసుకున్నారు. బండి విడుదల చేయాలని ఏ ఏ స్సైని అడిగితే ఎవరు సీజ్ చేస్తే వారినే అడగాలని నిర్లక్ష్యంగా సమాధానం వస్తోందని కానిస్టేబుల్ చెప్పారు. రాత్రి అనక పగలు అనక మేము కూడా కోవిడ్ డ్యూటీ చేస్తున్నా మరి ఇలా బండ్లు పట్టుకొని వేధిస్తే ఎలా అని కానిస్టేబుల్ వాపోయారు.

Full View



Tags:    

Similar News