టోల్ ప్లాజాల వద్ద బారీగా ట్రాఫిక్ జామ్

సంక్రాంతి పండుగ దగ్గరపడింది. తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ సంతోషంగా జరుపుకునే ఈ పండుగ కోసం తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు నగరవాసులు సిద్ధమయ్యారు.

Update: 2020-01-11 11:11 GMT

నెల్లూరుః సంక్రాంతి పండుగ దగ్గరపడింది. తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ సంతోషంగా జరుపుకునే ఈ పండుగ కోసం తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు నగరవాసులు సిద్ధమయ్యారు. ఇక రేపటి నుంచి విద్యా సంస్థలకు కూడా సెలవులు ఉండటంతో.. విద్యార్థులు ఇంటిబాట పట్టారు. దీంతో నగరంలోని రైల్వేస్టేషన్ బస్టాప్‌లు ప్రయాణీకులతో బిజీగా ఉన్నాయి. మరోవైపు హైదరాబాద్‌, విజయవాడ 65 నెంబర్‌ జాతీయ రహదారిపై ఉన్న టోల్‌ ప్లాజాల వద్ద వాహనాల రద్ధీ పెరిగింది.

టోల్‌ గేట్ల వద్ద భారీగా ట్రాఫిక్‌ జామ్ ఏర్పడుతోంది.తాజాగా వెంకటాచలం టోల్‌ గేట్‌ వద్ద భారీ ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. చెన్నై నుంచి తెలంగాణ, హైదరాబాద్‌ విజయవాడ వైపు వెళ్లే వారికి టోల్‌గేట్‌లో 8 టోల్‌ బూత్‌లను తెరిచారు. అయితే బూత్‌లో ఫాస్టాగ్ స్కానర్‌ సరిగా పనిచేయకపోవడంతో పాత రేట్ల ప్రకారం డబ్బులు తీసుకొని వాహనాలను పంపుతున్నారు. మరోవైపు రహదారిపై ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పోలీసులు యాక్సిడెంట్‌ బ్లాక్‌ స్పాట్‌లను గుర్తించి బారికేడ్‌లు ఏర్పాటు చేశారు.

Tags:    

Similar News