విస్తృత తనిఖీలు నిర్వహించిన ట్రాఫిక్ డిఎస్పి మల్లికార్జునరావు
ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా స్టోన్ హౌస్ పేట లక్ష్మీపురం సెంటర్ లో ఇటీవల ఏర్పాటు చేసిన వన్ వే మార్గాన్ని పరిశీలించారు.
నెల్లూరు: సరైన ధ్రువ పత్రాలు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా, తిరుగుతున్న అనేక వాహనాలను ట్రాఫిక్ డిఎస్పి మల్లికార్జునరావు, సీఐ ఆంజనేయ రెడ్డితో కలసి విస్తృత తనిఖీలు చేపట్టారు. ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా స్టోన్ హౌస్ పేట లక్ష్మీపురం సెంటర్ లో ఇటీవల ఏర్పాటు చేసిన వన్ వే మార్గాన్ని పరిశీలించారు.
ఆ మార్గంలోకి వచ్చిన భారీ వాహనాలను నిలిపి జరిమానాలు విధించారు. నిబంధనలకు విరుద్ధంగా, అధిక సంఖ్యలో స్కూలు పిల్లలను ఎక్కించుకొని తిరుగుతున్న ఆటోలను నిలిపి, వారికి కూడా జరిమానాలు విధించడం జరిగింది. దీంతో పాటు ఎక్కువ మంది విద్యార్థులను ఎక్కించుకున్న వారికి కౌన్సిలింగ్ చేయడం విశేషం. తనిఖీల్లో ఎస్ఐ వెంకట రమణయ్య, సిబ్బంది పాల్గొన్నారు.