ఈరోజు ఏపీ కేబినెట్‌ కీలక సమావేశం

Update: 2020-01-27 01:48 GMT

ఏపీ శాసనమండలి రద్దు చేస్తారో లేదో ఈరోజు తేలిపోనుంది. ఇవాళ శాసనసభ ప్రారంభానికి ముందు సమావేశంకానున్న మంత్రివర్గం.... మండలి రద్దుపై కీలక నిర్ణయం తీసుకోనుంది. కేబినెట్‌లో తీసుకునే నిర్ణయం మేరకే శాసనసభలో వ్యవహరించే అవకాశం కనిపిస్తోంది. అలాగే, మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుపై ఆర్డినెన్సులు జారీపైనా కేబినెట్‌ నిర్ణయం తీసుకోనుంది.

ఏపీ శాసనమండలి కొనసాగుతుందో లేక రద్దు చేస్తారో ఈరోజు తేలిపోనుంది. మండలి ఉండాలో వద్దో శాసనసభలో చర్చించి నిర్ణయం తీసుకుంటామంటూ ప్రకటించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి... ఇవాళ అత్యవసర మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. సీఎం జగన్‌ అధ్యక్షతన సమావేశమవుతున్న కేబినెట్‌... శాసనసభ మండలిపై చర్చించి నిర్ణయం తీసుకోనుంది. అయితే, మంత్రివర్గ సమావేశంలో తీసుకునే నిర్ణయం మేరకే శాసనసభలో వ్యవహరించే అవకాశం కనిపిస్తోంది.

ఎందుకీ మండలి అంటూ శాసనసభ వేదికగా సీఎం జగన్ ఘాటు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కౌన్సిల్ రద్దు దాదాపు ఖాయమని అంటున్నారు. అయితే, పరిస్థితులేమైనా ప్రభుత్వానికి అనుకూలంగా మారితే మాత్రం మండలి రద్దుపై పునరాలోచించే అవకాశముందని చెబుతున్నారు. ఒకవేళ సానుకూల వాతావరణం లేకపోతే మాత్రం కౌన్సిల్ రద్దు ఖాయమేనంటున్నారు. నిజానికి, శాసనసభ శీతాకాల సమావేశాల్లో ఇంగ్లీషు మీడియం, ఎస్సీ ఎస్టీ కమిషన్ల బిల్లులను మండలి తిరస్కరించినప్పుడే... కౌన్సిల్ రద్దు ఆలోచన చేశారని, ఇక, ఇప్పుడు మూడు రాజధానుల బిల్లు విషయంలోనూ చుక్కెదురు కావడంతో కౌన్సిల్ రద్దు చేయాలన్న నిర్ణయానికి వచ్చేశారని అంటున్నారు.

మొత్తానికి, ప్రభుత్వ నిర్ణయాలను అడ్డుకుంటూ, సర్కారు పెద్దల కంట్లో నలుసులా మారిన శాసన మండలి రద్దు ఖాయమని అంటున్నారు. ఒకవేళ మండలి పరిస్థితులు ప్రభుత్వానికి అనుకూలంగా మారితే మాత్రం వ్యూహం మారొచ్చని వైసీపీ నేతలు చెబుతున్నారు. అలాజరగని పక్షంలో, మండలిని రద్దు తప్పదని అంటున్నారు.  

Tags:    

Similar News