JanaSena: ఇవాళ జనసేన ఆవిర్భావ దినోత్సవం

JanaSena: గుంటూరు జిల్లా ఇప్పటంలో భారీ బహిరంగ సభ

Update: 2022-03-14 01:30 GMT

JanaSena: ఇవాళ జనసేన ఆవిర్భావ దినోత్సవం 

JanaSena: ఇవాళ గుంటూరు కేంద్రంగా జనసేనాని పవన్ కల్యాణ్ సమర శంఖం పూరించబోతున్నారు. సోమవారం జనసేన ఆవిర్భావ దినోత్సవం ఈసందర్భంగా గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామ సమీపంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ వేదికకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టారు. ఆవిర్భావ సభ కోసం సాంగ్ రిలీజ్ చేసింది జనసేన పార్టీ. ఈ సభలో పవన్ కీలక ప్రసంగం చేయనున్నారు. ఆదివారం రాత్రి గన్నవరం ఎయిర్ పోర్టులో పవన్ కల్యాణ్ కు అభిమానులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

అంతకు ముందే పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి జనసేనాని పవన్ కల్యాణ్ ఓ వీడియో విడుదల చేశారు. జనసేన ఆవిర్భావ దినోత్సవానికి జనసైనికులతో పాటు రాష్ట్ర క్షేమాన్ని ఆకాంక్షించే ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే అని ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. గ్రామాల నుంచి క్షేమంగా సభకు వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సభను జనసేన ఆవిర్భావ దినోత్సవంగా చూడటం లేదని ఏపీ భవిష్యత్తు కోసం జనసేన దిశానిర్దేశం చేయబోతోందన్నారు. వైసీపీ రెండున్నరేళ్ల పాలనలో ఏమేమి జరిగాయి. ప్రజలు ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నారు. భవిష్యత్తు ఎలా ఉండబోతోందన్న అంశాలపై సభలో మాట్లాడతానన్నారు పవన్ . 

Tags:    

Similar News