నేడు ఏపీ కేబినెట్ కీలక భేటీ.. చర్చించే అంశాలివే..!

Update: 2019-11-13 03:42 GMT

అమరావతిలో నేడు ఏపీ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఉదయం 11 గంటలకు మంత్రివర్గం సమావేశం జరగనుంది. పలు అంశాలపై మంత్రివర్గం చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ప్రధానంగా సింగపూర్‌తో స్టార్టప్ ఏరియా రద్దుకు ఆమోదం తెలపనుంది, ఇసుకను అక్రమంగా తరలించేవారికి జైలు శిక్ష వేసేలా చట్టంలో సవరణలకు కేబినెట్ నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.

పట్టణాల్లో అక్రమ లే ఔట్ల క్రమబద్ధీకరణ, గ్రామ న్యాయాలయాల ఏర్పాటుపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 6వ తరగతి వరకూ ఇంగ్లీష్ మీడియం అమలు, కాలుష్య నిర్వహణ సంస్థ ఏర్పాటుకు ఆమోదం తెలపనుంది. ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారులకు రూ.10 లక్షల సాయం, న్యాయవాదుల సంక్షేమ నిధి, ప్రభుత్వ భూముల అమ్మకాలు, బిల్డ్ ఏపీ వంటి ముఖ్యమైన అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది.

Tags:    

Similar News