Vizag Steel Plant: విశాఖ ఉక్కు సంకల్పానికి వంద రోజులు
Vizag Steel Plant: నేటితో వందోరోజుకు చేరుకున్న స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ దీక్షలు *కూర్మన్నపాలెం గేట్ దగ్గర కార్మికుల నిరసన
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిరసన (ఫైల్ ఇమేజ్)
Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కార్మికులు చేస్తున్న ఉద్యమం వందో రోజుకు చేరుకుంది. వంద రోజులుగా కార్మికులు రిలే నిరహార దీక్షలు చేస్తున్నారు. వందరోజులు పూర్తయిన సందర్భంగా వినూత్న నిరసనకు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఇవాళ కూర్మన్నపాలెం గేట్ దగ్గర కార్మికులు ఆందోళన చేపట్టనున్నారు. వంద అడుగుల బ్యానర్ తో నిరసన తెలపనున్నారు. వంద జెండాలతో ఆందోళన చేపట్టనున్నారు.