పెరిగిన తిరుమల ఆదాయం

Update: 2021-01-12 04:58 GMT

కోవిడ్ కారణంగా తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య పెరగకపోయినా హుండీ ద్వారా లభించే ఆదాయం గణనీయంగా పెరుగుతోంది. గతంతో పోలిస్తే స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య 50శాతానికి చేరుకోగా ఆదాయం మంత్రం మరింత పెరిగింది. కోవిడ్ నిబంధనలతో గత డిసెంబర్‌లో శ్రీవారిని 11 లక్షల మంది దర్శించుకున్నారు. ఆ నెలలో హుండీ ఆదాయం 78 కోట్లకు చేరుకుంది.

కరోనా నిబంధనలతో టీటీడీ పరిమిత సంఖ్యలోనే భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతి ఇచ్చింది. కరోనా కారణంగా భక్తులు లేక టీటీడీ ఆదాయం గణనీయంగా తగ్గింది. 1350 కోట్ల ఆదాయం వస్తుందనుకుని అంచానా వేసిన టీటీడీ అది 500 కోట్లకు పరిమితం అయింది. అలానే టీటీడీ వార్షిక బడ్జెట్ కూడా 3.309 కోట్లతో అంచనా వేసింది కానీ, ఈ ఏడాది 2వేల కోట్లకే పరిమితం అయింది. టీటీడీ ఆదాయం తగ్గుముఖం పట్టడమే కాకుండా శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది.

ఆన్‌లాక్‌ భాగంగా తెరుచుకున్న ఆలయానికి మొదటి రోజు 6 వేల మంది భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతి ఇచ్చారు. హుండీ ఆదాయం 30 నుంచి 50 లక్షలు లభించేది. తర్వాత అంచెల వారిగా భక్తుల సంఖ్య పెంచారు. ప్రస్తుతం నిత్యం 40 వేల మంది వరకు భక్తులను దర్శనానికి అనుమతిస్తుంది టీటీడీ. దీంతో ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది 2020 డిసెంబర్‌లో హుండీ ద్వారా 78 కోట్లు ఆదాయం లభించింది.

Full View


Tags:    

Similar News