Tirumala Tirupati: ఈనెల 7 నుంచి 15 వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సావాలు
Tirumala Tirupati: కోవిడ్ నేపథ్యంలో వరుసగా రెండో ఏడాది ఏకాంతంగా బ్రహ్మోత్సవాలు...
ఈనెల 7 నుంచి 15 వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సావాలు
Tirumala Tirupati: తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేసింది టీటీడీ. ఈనెల 7 నుంచి 15 వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. కోవిడ్ నేపథ్యంలో వరుసగా రెండో ఏడాది ఏకాంతంగా వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు.
రేపు శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. ఈనెల 6న సాయంత్రం బ్రహ్మోత్సవాలకు అంకరార్పణ, 7వ తేదీ సాయంత్రం ధ్వజారోహణం చేపట్టనున్నారు.