Tirumala Brahmotsavam 2023: నేటి నుంచి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు

Tirumala Brahmotsavam 2023: బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శ్రీవారి ఆర్జిత సేవలు రద్దు

Update: 2023-10-15 04:58 GMT

Tirumala Brahmotsavam 2023 : నేటి నుంచి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు 

Tirumala Brahmotsavam 2023: తిరుమల శ్రీవారి ఆయంలో నవరాత్రి బ్రహ్మోత్సవాల వేడుక వైభవంగా ప్రారంభమైంది. తొమ్మిది రోజుల పాటు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాలు నిర్వహించేందుకు స్వామివారి అనుమతి కోరుతూ అర్చకులు అంకురార్పణ కార్యక్రమాన్ని శాస్ర్తోక్తంగా నిర్వహించారు. అంతకుముందు శ్రీవారి సర్వసైన్యాధ్యక్షుడైన విశ్వక్సేనులవారు బంగారు తిరుచ్చిపై ఆలయ మాడ వీధుల్లో ఊరేగారు. ఉదయం 9 గంటలకు బంగారు తిరుచ్చిపై వాహన సేవ నిర్వహించనున్నారు అర్చకులు. రాత్రి 7 గంటలకు పెద్దశేష వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామి ఊరేగనున్నారు. రాత్రి నుంచి వాహనసేవలు ప్రారంభంకానున్నాయి. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తొమ్మిదిరోజుల పాటు ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు, వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు.

ఇక ఆలయ మాడ వీధుల్లో విశ్వక్సేనులవారి ఊరేగింపును ఆగమభాషలో సేనాధిపతి ఉత్సవంగా పిలుస్తారు. జగద్రక్షకుడైన శ్రీవారికి జరగబోయే బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు ఎలా ఉన్నాయో స్వయంగా తానే వెళ్లి పర్యవేక్షించడమే ఈ ఉత్సవం యెక్క ప్రాశస్త్యం. అనంతరం శ్రీవారి ఆయంలోని యాగశాలలో అర్చకులు నిర్వహించిన అంకురార్పణ ఘట్టంతో బ్రహ్మోత్సవాలకు బీజం పడింది. ఇక విత్తనాలు మొలకెత్తడాన్నే అంకురార్పణ అంటారు. ఉత్సవాలు విజయవంతం కావాలని సంకల్పించడంతో పాటు స్వామివారి ఆశీస్సులు పొందడమే అంకురార్పణ ఘట్టం ఉద్దేశ్యమని అర్చకులు చెబుతున్నారు.

Tags:    

Similar News