Tirumala: తిరుమలలో భక్తుల కోసం పాదరక్షలు భద్రపర్చేందుకు 10 కౌంటర్ల ఏర్పాటు
Tirumala: వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం వద్ద 1187 ర్యాక్‌లు
Tirumala: తిరుమలలో భక్తుల కోసం పాదరక్షలు భద్రపర్చేందుకు 10 కౌంటర్ల ఏర్పాటు
Tirumala: తిరుమలలో పాద రక్షల సమస్యకు టీటీడీ చర్యలు చేపట్టింది. పాదరక్షలు భద్రపరిచే కౌంటర్లను టీటీడీ ప్రారంభించింది. భక్తుల సౌకర్యార్థం అన్నప్రసాదం కాంప్లెక్స్, ప్రధాన కళ్యాణ కట్ట కాంప్లెక్స్‌ల వద్ద పాదరక్షలు భద్రపరచుటకు 10 కౌంటర్లను ఏర్పాటు చేసింది. ఈ కౌంటర్లలో భక్తులు నంబర్ ఉన్న బ్యాగ్‌లను తీసుకొని పాదరక్షలను ఉంచి, దారంతో కట్టి, అదే నంబర్ ఉన్న రాక్‌లో తిరిగి ఉంచాలని టీటీడీ ఈవో తెలిపారు. భక్తుడికి ర్యాక్ – బ్యాగ్‌తో సమానమైన నంబర్‌తో టోకెన్ జారీ చేయబడుతుందన్నారు.
భక్తులు తిరిగి వచ్చిన తర్వాత టోకెన్ ఇచ్చి వారి పాదరక్షలు పొందవచ్చని తెలిపారు. అంతేకాకుండా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం వద్ద 1187 ర్యాక్‌లు, ప్రధాన కళ్యాణ కట్ట వద్ద 4 వేల ర్యాక్‌లను భక్తుల కోసం అందుబాటులో ఉంచారు. త్వరలో పీఏసీ 1,2,3, నారాయణగిరి క్యూలైన్లు, ఏటీపీ సర్కిళ్లల్లో కూడా పాదరక్షలు భద్రపరచు కేంద్రాలను త్వరలోనే ప్రారంభించబోతున్నట్లు ఆలయ ఈవో తెలిపారు.