Tirumala Darshan: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణ స్థాయిలోనే... దర్శనానికి 10 గంటల సమయం
Tirumala Darshan: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ సాధారణంగా కనిపించింది. శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు పెద్దగా కాకపోయినా, ఓ మోస్తరుగా తరలివచ్చారు.

సాధారణ దర్శనానికి టోకెన్లు లేకుండా వచ్చిన భక్తులకు సుమారు 9 నుంచి 10 గంటల వరకు సమయం పడుతోంది.
రూ.300 ప్రత్యేక దర్శనం టోకెన్లు పొందిన భక్తులకు మాత్రం 4 గంటల్లో స్వామి వారి దర్శనం జరుగుతోంది.
సోమవారం నాటికి, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 10 కంపార్ట్‌మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనానికి వేచి ఉన్నారు.
ఆదివారం నాడు, మొత్తం 88,497 మంది భక్తులు శ్రీ వేంకటేశ్వరుని దర్శించుకున్నారు. ఇందులో 29,054 మంది భక్తులు తలనీలాలు సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు.
తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.34 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు ప్రకటించారు.