Guntur: కానుకల పంపిణీలో తొక్కిసలాట.. ముగ్గురు మృతి
Guntur: ఘటనా స్థలంలో ఒకరు.. ఆస్పత్రిలో ఇద్దరు మృతి
Guntur: కానుకల పంపిణీలో తొక్కిసలాట.. ముగ్గురు మృతి
Guntur: నెల్లూరు జిల్లా కందుకూరు దుర్ఘటన మర్చిపోకముందే తాజాగా గుంటూరులో మరోసారి అలాంటి ఘటనే జరిగింది. గుంటూరులో చంద్రన్న సంక్రాంతి కానుకతో పాటు జనతావస్త్రాల పంపిణీ కార్యక్రమం చేపట్టగా తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఒక మహిళ అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరు మహిళలు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలారు. పలువురు మహిళలు స్పృహతప్పి పడిపోగా.. గుంటూరు GGHలో చికిత్స అందిస్తున్నారు.
గుంటూరులో ఉయ్యూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించి వెళ్లిపోయారు. అనంతరం ఫౌండేషన్ పంపిణీ చేస్తున్న జనతావస్త్రాల కోసం మహిళలు భారీగా తరలివచ్చారు. 30వేల మందికి కూపన్లు పంపిణీ చేసిన టీడీపీ నేతలు.. టోకెన్లతో ఉయ్యూరి ఫౌండేషన్ కౌంటర్ వద్దకు వెళ్లాలని అనౌన్స్‌మెంట్ చేశారు. దీంతో వస్త్రాలు పంపిణీ చేసే కౌంటర్ వద్దకు మహిళలు పరుగెత్తారు. ఒక్కసారిగా బారికేడ్లు సైతం తోసేసుకుంటా మహిళలు పరుగులు పెట్టారు. కౌంటర్ దగ్గర తోపులాట జరిగడంతో తొక్కిసలాటకు కారణమైంది.
ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ అఫీజ్, RDO ప్రభాకర్ రెడ్డి సందర్శించారు. తోపులాట చోటుచేసుకోవడానికి గల కారణాలపై ఆరా తీశారు. జనతా వస్త్రాల పంపిణీ కోసం చేసిన ఏర్పాట్లు.. ఎక్కడ లోటుపాట్లు జరిగాయని గ్రౌండ్ మొత్తం తిరిగి చూశారు. గుంటూరు ఘటన బాధకరమన్న ఎస్పీ.. 200 మంది పోలీసులతో బందోబస్తు కల్పించామన్నారు. బారీకేడ్ల వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందని.. పూర్తిగా విచారణ జరుగుతుందని చెప్పారు.