చంద్రగ్రహణం తర్వాత తెరుచుకున్న తిరుమల శ్రీవారి ఆలయం

Update: 2019-07-17 01:35 GMT

చంద్రగ్రహణం వీడడంతో తిరుమల శ్రీవారి ఆలయం తెరచుకుంది. ఉదయం సరిగ్గా 4.45గంటలకు ఆలయ మహా ద్వారాన్ని తెరిచి సుప్రభాత పారాయణంతో శ్రీవారిని మేలుకొల్పారు. మిగిలిన ద్వారాలను ఒక్కొక్కటిగా తెరిచిన తర్వాత ఆలయాన్ని పూర్తిగా శుద్ధి చేసి.... పుణ్యవాహచనం చేయడంతో గ్రహణ దోషం పోయింది. అనంతరం మూలవిరాట్టు‌కు ఇవాళ జరగాల్సిననిత్య కైంకర్యాలను ఏకాంతంగా అర్చక స్వాములు నిర్వహించారు. బంగారు వాకిలి వద్ద ఉదయం 9గంటల నుండి వార్షిక ఉత్సవమైన అణివార ఆస్థానాన్ని టీటీడీ వైభవోపేతంగా నిర్వహించనుంది. ఆస్థానంముగిసిన తర్వాత 11గంటల తర్వాత నుండి సామాన్య భక్తులను శ్రీవారిని దర్శనానికి టీటీడీ అనుమతించనుంది.  

Tags:    

Similar News