నిందితులని శిక్షిస్తే సీఎం జగన్ వద్దకి నేరుగా వెళ్లి సత్కరిస్తా : ఆయేషా తల్లి

12 ఏళ్ల క్రితం చనిపోయిన తన కూతురు మృతదేహాన్ని మళ్లీ బయటకు తీయడం ఓ తల్లిగా బాధగా ఉందన్నారు.

Update: 2019-12-14 03:44 GMT

12 ఏళ్ల క్రితం చనిపోయిన తన కూతురు మృతదేహాన్ని మళ్లీ బయటకు తీయడం ఓ తల్లిగా బాధగా ఉందన్నారు. రీ పోస్ట్ మార్టం ద్వారా నిందితులు బయటపడతారో లేదో తెలీదు కాని న్యాయం జరుగుతుందని ఆశ ఉందన్నారు. నిర్భయ, దిశకు మాత్రం చట్టాలు తెచ్చారు ఆయేషా హత్య విషయంలో ఇప్పటి వరకు నిందితులను కూడా పట్టుకోలేకపోయారని ఆయేషా తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. 21 రోజుల్లో నిందితులని పట్టుకుని శిక్షిస్తే సీఎం జగన్ వద్దకి తనే నేరుగా వెళ్లి సత్కరిస్తానన్నారు ఆయేషామీరా తల్లి‌.

ఆయేషా మీరా మృతదేహానికి రీపోస్టుమార్టం కొనసాగుతోంది. గుంటూరు జిల్లా తెనాలిలోని చెంచుపేట శ్మశానవాటికలో ఢిల్లీ నుంచి వచ్చిన ఫోరెన్సిక్ నిపుణుల ఆధ్వర్యంలో శవపరీక్ష నిర్వహిస్తున్నారు. ఆయేషా మీరా మృతదేహం ఆనవాళ్లను కూలీలు బయటకు తీశారు. సీబీఐ ఎస్పీ విమల్ ఆదిత్య పర్యవేక్షణలో ఫోరెన్సిక్‌ నిపుణులు ఆనవాళ్లను నమోదు చేసుకున్నారు. ఎముకలు, వెంట్రకలు, గోళ్లను క్షుణ్ణంగా పరిశీలించి ఫోరెన్సిక్‌ బృందం నివేదికను తయారు చేయనుంది.

Tags:    

Similar News