ఉత్తరకోస్తాను ఆనుకొని ఒడిశా వద్ద కేంద్రీకృతమైన అల్పపీడనం
Rain Alert: అల్పపీడనానికి అనుబంధంగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
ఉత్తరకోస్తాను ఆనుకొని ఒడిశా వద్ద కేంద్రీకృతమైన అల్పపీడనం
Rain Alert: ఉత్తరకోస్తాను ఆనుకొని ఒడిశా వద్ద అల్పపీడనం కేంద్రీకృతమైంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో మరింత చురుగ్గా నైరుతి రుతుపవనాలు కదులుతున్నాయి. దీంతో ఉత్తర కోస్తాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ హెచ్చరించింది. దక్షిణ కోస్తా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని సూచించింది. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు.