Vijayawada: దారుణం.. భర్త తాగొచ్చి వేధిస్తున్నాడని మరిగే వేడి నీళ్లు పోసిన భార్య.. పరిస్థితి విషమం
Vijayawada: మద్యం తాగి నిద్రిస్తున్న సమయంలో వేడి నీళ్లు పోసిన భార్య
Vijayawada: దారుణం.. భర్త తాగొచ్చి వేధిస్తున్నాడని మరిగే వేడి నీళ్లు పోసిన భార్య.. పరిస్థితి విషమం
Vijayawada: విజయవాడలో దారుణం చోటుచేసుకుంది. భర్త తాగొచ్చి వేధిస్తున్నాడని మరిగే వేడి నీళ్లు పోసింది భార్య. మద్యం తాగి నిద్రిస్తున్న సమయంలో భర్తపై వేడి నీళ్లు పోసింది. ఈ ఘటనలో భర్త దుర్గారావుకు తీవ్రగాయాలు కాగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇక.. కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు. భర్త ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.