Viveka Murder Case: వివేకా హత్య కేసులో నేటితో ముగియనున్న విచారణ
Viveka Murder Case: జూన్ 30లోపు కేసు దర్యాప్తు పూర్తి చేయాలని గతంలో సుప్రీం ఆదేశం
Viveka Murder Case: వివేకా హత్య కేసులో నేటితో ముగియనున్న విచారణ
Viveka Murder Case: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణ నేటితో ముగియనుంది. జూన్ 30లోపు కేసు దర్యాప్తు పూర్తి చేయాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఈ కేసులో సాక్షులను, నిందితులను, అనుమానితులను సుదీర్ఘంగా విచారించిన సీబీఐ.. వివేకా హత్య కేసులో అవినాష్‌రెడ్డి పాత్రపై విచారణ చేసి స్టేట్‌మెంట్ రికార్డ్ చేసింది.
అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పొందిన తర్వాత.. ఐదుసార్లు విచారణ చేసిన సీబీఐ.. వివేకా హత్య కేసు విచారణ ముగియడంతో.. సీబీఐ కోర్టులో సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్ వేయనుంది. జూలై 3న సుప్రీంకోర్టులో అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ కేసులో మరికొంత సమయం ఇవ్వాలని సీబీఐ సుప్రీంకోర్టును కోరనుంది.