Chittoor: బైక్‌ను తప్పించబోయి ఆర్టీసీ బస్సు బోల్తా
Chittoor: నలుగురు ప్రయాణికులకు గాయాలు, ఆస్పత్రికి తరలింపు
Chittoor: బైక్‌ను తప్పించబోయి ఆర్టీసీ బస్సు బోల్తా
Chittoor: చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలో బైక్‌ను తప్పించబోయి ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ప్రమాదంలో నలుగురు ప్రయాణికులకు స్వల్పగాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులున్నారు. గాయపడ్డ వారిని కుప్పం ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఆర్టీసీ అధికారులు విచారణ చేస్తున్నారు.