Prakasam Barrage: ప్రకాశం బ్యారేజ్‌ వద్ద 3.79 లక్షల క్యూసెక్కుల ఔట్‌ ఫ్లో

Prakasam Barrage: మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేసిన అధికారులు * పులిచింతల ప్రాజెక్ట్‌ వద్ద కొట్టుకపోయిన క్లస్టర్‌ గేట్‌

Update: 2021-08-06 01:47 GMT

ప్రకాశం బ్యారేజ్‌ వద్ద 3.79 లక్షల క్యూసెక్కుల ఔట్‌ ఫ్లో (ఫోటో ది హన్స్ ఇండియా)

Prakasam Barrage: ప్రకాశం బ్యారేజ్‌ నుంచి నిన్న అర్థరాత్రి 3.79 లక్షల క్యూసెక్కుల ఔట్‌ ఫ్లో కొనసాగింది. తీరప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నిన్న అర్థరాత్రి ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎప్పటికప్పుడు వరద ఉధృతిని పర్యవేక్షిస్తూ కృష్ణా, గుంటూరు జిల్లాల అధికార యంత్రాంగాన్ని అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పటికే విజయవాడలో 24 మంది సభ్యులతో కూడిన ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని సహాయక చర్యల కోసం ప్రభుత్వం అందుబాటులో ఉంచింది.

పులిచింతల గేట్లను ఆపరేట్ చేసే టూనియల్ గడ్డర్స్‌ విరగడంతో గేటు కొట్టుకుపోయింది. దీంతో డ్యామ్ దగ్గరకెళ్లిన ఎక్స్‌ఫర్ట్ టీములు అక్కడేం జరిగిందో పరిశీలించాయి. వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో స్టాప్ గేట్ అమర్చేందకు ఇబ్బందులు ఎదురువుతున్నట్టు టెక్నీషియన్లు చెప్పారు. సాగర్ నుంచి పులిచింతలకు సుమారు రెండు లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. పులిచింతల నుంచి కూడా 4 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్ట్‌లో నీటి మట్టం 5 మీటర్లకు చేరుకోగానే.. స్టాప్ లాక్ గేట్ అమరుస్తామని అంటున్నారు అధికారులు.

Tags:    

Similar News