Tirumala: శ్రీవారి ఆలయం నుంచి తరలిస్తుండగా బోల్తా పడిన హుండీ
Tirumala: ట్రాలీకి మహద్వారం గట్టుతగిలి పడిపోయిన హుండీ
Tirumala: శ్రీవారి ఆలయం నుంచి తరలిస్తుండగా బోల్తా పడిన హుండీ
Tirumala: తిరుమలలో శ్రీవారి హుండీ తరలిస్తుండగా మహాద్వారం వద్ద పడిపోయింది. శ్రీవారి ఆలయం లోంచి పరకామణి భవనానికి తరలిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ట్రాలీపై హుండీని తీసుకెళ్తున్న సందర్భంలో గట్టుకు తగులుకుని కింద పడిపోయింది. హుండీ పడిపోవడంతో కానుకలు బయటపడ్డాయి. అప్రమత్తమైన సిబ్బంది... వెంటనే కానుకలను పోగుచేశారు. హుండీని లిఫ్ట్ ద్వారా లారీలోకి ఎక్కించారు. ట్రాలీపై హుండీని తరలిస్తున్న సమయంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించినందు వల్లే హుండీ పడిపోయిందని అధికారులు భావిస్తున్నారు.