Palnadu: సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు ఇల్లు ముట్టడి
Palnadu: రాంబాబు ఇంటిని ముట్టడించిన యూత్ కాంగ్రెస్ నాయకులు
Palnadu: సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు ఇల్లు ముట్టడి
Palnadu: పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని మంత్రి అంబటి రాంబాబు నివాసాన్ని యూత్ కాంగ్రెస్ నాయకులు ముట్టడించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. యూత్ కాంగ్రెస్ నాయకులు, వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. డీఎస్సీ నోటిఫికేషన్లపై ప్లకార్డులతో నిరసన తెలియజేశారు యూత్ కాంగ్రెస్ నాయకులు. మెగా డీఎస్సీ పేరుతో సీఎం జగన్ నిరుద్యోగులను మోసం చేశారంటూ నినాదాలు చేశారు. 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పిన హామీని గాలికొదిలేశారని ప్రభుత్వంపై మండిపడ్డారు యూత్ కాంగ్రెస్ నాయకులు.