Andhra Pradesh: ఏపీ రైతులు పండగ చేసుకునే వార్త..వెంటనే రూ.50,000 సబ్సిడీ పొందండి..పూర్తి వివరాలివే..!
Andhra Pradesh: ఏపీ రైతులు పండగ చేసుకునే వార్త..వెంటనే రూ.50,000 సబ్సిడీ పొందండి..పూర్తి వివరాలివే..!
Andhra Pradesh: ఏపీలో ఉద్యానవన పంటలు వేసే రైతులకు గుడ్ న్యూస్. ప్రభుత్వం పండ్ల తోటల సాగుకు సంబంధించిన సబ్సిడీను భారీగా ఉపాధి హామీ స్కీం కింద 100శాతం ఇస్తోంది. పండ్ల మొక్క సాగు పెరకబోతోంది. మామిడి తోటలకు ఇది వరకు ఎకరాకు రూ. 13,300 రాయితీ ఉండేది. ఇప్పుడు దాన్ని రూ. 50, 000కి పెంచింది. మామిడి రైతులకు ఇది ఎంతో సంతోషం కలిగించే అంశమని చెప్పవచ్చు. ఏపీలో రానున్న ఏడాదిలో మామిడి దిగుబడి భారీగా పెరిగే అవకాశం ఉంది. తాజా నిర్ణయాలు రాష్ట్రంలోని ఉద్యాన పంటలు వేసే రైతులకు ఆర్థికంగా మేలు చేయనున్నాయి. వ్యవసాయ రంగంలో ఉత్పాదకత కూడా పెరగనుంది.
ఇటీవల ఏపీ సర్కార్ లోని ఉద్యానశాఖ మంత్రి ఈ కొత్త విధానాన్ని ప్రకటించారు. ఈ స్కీం కింద రైతులు పండ్ల తోటల మొక్కలను ఫ్రీగా పొందవచ్చు. అందువల్ల వారికి మొక్కలుకొనేందుకు అయ్యే ఖర్చులు భారీగా తగ్గుతాయి. అంతేకాదు మూడేండ్ల సాగు ఖర్చులు, నీటి సరఫరా, పురుగు మందులు, ఎరువులకు అయ్యే ఖర్చును కూడా ప్రభుత్వమే భరిస్తుంది. అలాగే డ్రిప్ ఇరిగేషన్ చేయసేందుకు కావాల్సిన ఆటోమేటిక్ పరికరాలు కూడా ప్రభుత్వం సాయం ద్వారా పొందవచ్చు. వాటికి కూడా భారీగా సబ్సిడీలు ఉంటాయి. అందువల్ల ఏపీలో డ్రిప్ ఇరిగేషన్ మరింత పెరుగుతుంది.
మరి ఈ ప్రయోజనాలన్నీ రైతులు పొందాలంటే ఒక షరతు కూడా ఉంది. ఐదు ఎకరాలలోపు సాగుభూమి ఉన్న రైతులకు ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఆ రైతులు ఫీల్డ్ అసిస్టెంట్ ఆఫీసర్ ను కలవాలి. ఏయే పండ్ల సాగు చేపట్టాలనుకుంటున్నారో కూడా చెప్పాలి. అప్పుడు ఆ ఆఫీసర్ పొలం పత్రాలను పరిశీలించి ఐదెకరాలలోపు ఉందో లేదో చూసి అప్పుడు దరఖాస్తు చేయిస్తారు. అన్నీ ఆ అధికారే చూసుకుంటారు. ఉద్యానవన శాఖ కార్యాలయానికి వెళ్తే పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.