టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఐడీ అధికారులు నోటీసులు

TDP: టీడీపీ అనుబంధ పత్రిక చైతన్యరథంలో వచ్చిన కథనాలపై.. వివరాలు సేకరించిన సీఐడీ అధికారులు

Update: 2023-04-11 12:15 GMT

టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఐడీ అధికారులు నోటీసులు

TDP: టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఐడీ అధికారులు నోటీసులిచ్చారు. టీడీపీ జనరల్ సెక్రటరీ పేరుతో లాయర్‌కు నోటీసులిచ్చారు. టీడీపీ అనుబంధ పత్రిక చైతన్యరథంలో వచ్చిన కథనాలపై వివరాలు సేకరించారు సీఐడీ అధికారులు. పత్రిక ఎడిటర్ ఎవరు..? నిర్వహణ ఎవరు చూస్తున్నారంటూ ప్రశ్నలు వేశారు. బుగ్గన బాగోతం, అపరిచితుడు అంటూ గతేడాది నవంబర్‌లో వార్త ప్రచురించింది చైతన్య రథం పత్రిక. ఈ కథనానికి సంబంధించి గతంలో బుగ్గన నోటీసులు కూడా పంపారు. అయితే మరోసారి బుగ్గన ఫిర్యాదు చేయడంతో టీడీపీ కార్యాలయానికి వెళ్లారు సీఐడీ అధికారులు. పలు వివరాలు సేకరించారు.

Tags:    

Similar News