Thummala Nageswara Rao: రైతుల ఉద్యమాన్ని కేంద్రం అర్థం చేసుకోవాలి
Thummala Nageswara Rao: నిరసనలోకి అసాంఘిక శక్తులు చొరబడకుండా చూసుకోవాలి
Thummala Nageswara Rao: రైతుల ఉద్యమాన్ని కేంద్రం అర్థం చేసుకోవాలి
Thummala Nageswara Rao: రైతులు చేస్తున్న ఉద్యమాన్ని కేంద్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాలని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెం మండలం గురవాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయ స్వామి ఆలయాన్ని మంత్రి దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన ఆయనకు తెలుగుదేశం నాయకులు ఘనస్వాగతం పలికారు. స్వామికి ప్రత్యేక పూజలు చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందించారు. ఢిల్లీ పొలిమేరలో చేస్తున్న నిరసన ఉద్యమం ప్రశాంతంగా జరగాలనీ, రైతుల నిరసనలో అసాంఘిక శక్తులు చొరబడకుండా రైతులు సమ్యమనం పాటించాలని కోరారు.