ఎర్రచందనం స్మగ్లింగ్‌పై సీబీఐ విచారణకు వివరాలు కోరిన కేంద్ర ప్రభుత్వం
*ఎర్రచందనం స్మగ్లింగ్‌పై స్పందించిన కేంద్రం
ఎర్రచందనం స్మగ్లింగ్‌పై సీబీఐ విచారణకు వివరాలు కోరిన కేంద్ర ప్రభుత్వం
Red Sandalwood Smuggling: ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల శేషాచలం ఆడవులతో పాటు,.... అనేక ప్రాంతాల్లో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం స్మగ్లింగ్, చట్ట విరుద్ధ కార్యకలాపాలపై సీబీఐ విచారణ చేపట్టాలని పారిశ్రామికవేత్త రామచంద్రయాదవ్ కోరారు. ఇందులో భాగంగా కేంద్ర అటవీశాఖ, పర్యవరణశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌కు వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు. ఈ విషయమై ఎర్రచందనం స్మగ్లింగ్ నివారణ చర్యలపై వివరాలు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వ సహాయ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్ శివానంద్ తలావార్ ఆదేశించారన్నారు. అక్రమ తరలింపును అరికట్టి స్మగ్లర్లను కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.