ఏపీలో మరికొద్ది సెపట్లో మూడవ విడత పంచాయతీ ఎన్నికలు

Update: 2021-02-17 00:55 GMT

Representational Image

ఏపీలో మరికొన్ని గంటల్లో మూడవ విడత పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు పోలింగ్ జరగనుంది. సాయంత్రం 4 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. కౌంటింగ్‌ ప్రారంభమైన కొన్ని గంటల్లోనే ఫలితాలు వెల్లడి కానున్నాయి. మావోయిస్టు ప్రాంతాల్లో ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు పోలింగ్ జరుగనుంది. 3వేల 221 గ్రామపంచాయతీ సర్పంచుల స్థానాలకు గాను 579 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 31వేల 516 వార్డు మెంబర్లలకు గాను 11వేల 753 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. 13 జిల్లాలలో, 20 రెవిన్యూ డివిజన్లలో, 160 మండలాలలో, 55లక్షల 75వేల 004 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు.

విశాఖపట్టణం, పశ్చిమ గోదావరి మరియు ప్రకాశం జిల్లాలలో ఒక్కొక్క పంచాయతీలో "నో" నామినేషన్ ఉండటంతో 2వేల 642 పంచాయతీలకు బదులు 2వేల 639 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 7వేల 757 మంది అభ్యర్ధులు పోటీ చేస్తున్నారు. వార్డు మెంబర్లకు 43 వేల162 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.

మూడవ విడత ఎన్నికల కు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు అధికారులు.. మూడవ దశ ఎన్నికలకు 26వేల 851 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కొరకు కౌంటింగ్ సెంటర్ల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు.. కౌంటింగ్ కొరకు అవసరమైన సిబ్బంది ఏర్పాటు చేశారు. 50వేల 020 మంది విధుల్లో పాల్గొంటున్నారు.

Full View


Tags:    

Similar News