Andhra Pradesh: గుంటూరు మున్సిపల్ ఎన్నికల్లో ఘర్షణ
Andhra Pradesh: కేఎల్‌పీ పబ్లిక్ స్కూల్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద గర్షణ
Representational Image
Andhra Pradesh: గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఘర్షణ చోటు చేసుకుంది. గుంటూరు కేఎల్‌పీ పబ్లిక్ స్కూల్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో మాజీ ఎంపీ మోదుగుల పోలింగ్ బాక్సులు పగులకొట్టారని టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. 42వ డివిజన్ టీడీపీ అభ్యర్ధి వేములపల్లి శ్రీరాంప్రసాద్ పై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఆగ్రహంతో మాజీ ఎంపీ మోదుగుల కార్లపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి నేత్వత్వంలో ఇరు వర్గాలను చెదరగొట్టారు.