పుట్టపర్తి ఎయిర్‌పోర్టులో ప్రకాశ్‌ నాయుడికి చేదు అనుభవం

ఏపీ మాంస అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ ప్రకాష్‌ నాయుడుకు చేదు అనుభవం పుట్టపర్తి ఎయిర్‌పోర్టు లోపలకి వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు లోకేష్‌‌కు స్వాగతం పలికేందుకు ఎయిర్‌పోర్టుకు వెళ్లిన ప్రకాష్‌ నాయుడు

Update: 2025-11-07 12:50 GMT

పుట్టపర్తి ఎయిర్‌పోర్టులో ప్రకాశ్‌ నాయుడికి చేదు అనుభవం

ఏపీ మాంస అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ ప్రకాశ్‌ నాయుడుకు చేదు అనుభవం ఎదురైంది. పుట్టపర్తి ఎయిర్‌పోర్టు దగ్గర లోపలకి వెళ్లకుండా ఆయన్ను పోలీసులు అడ్డుకున్నార. మంత్రి నారా లోకేష్‌ పర్యటన సందర్భంగా స్వాగతం పలికేందుకు ప్రకాశ్ నాయుడు ఎయిర్‌పోర్టుకు వెళ్లారు. అయితే ప్రకాశ్ నాయుడును పోలీసులు అనుమతించకుండా అడ్డుకున్నారు. దాంతో లిస్టులో తన పేరు ఉందా లేదా చెప్పాలని ప్రకాష్ నాయుడు పోలీసులను అడిగారు. వెంటనే అతన్ని అక్కడ నుంచి బలవంతంగా తరలించాలని చూశారు పోలీసులు. ఈ క్రమంలో పోలీసులకు, ప్రకాశ్‌కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మరోవైపు పోలీసులు ప్రకాశ్‌ను పంపేందుకు ప్రయత్నించగా.. అతని అనుచరులు పోలీసులను అడ్డుకున్నారు.

Tags:    

Similar News