శ్రీశైల దేవస్థానం పరిపాలన భవనంలో ఆలయ ట్రస్ట్ బోర్డ్ సమావేశం

Srisailam: పాల్గొన్న శ్రీశైలం ఆలయ ఛైర్మన్ చక్రపాణి రెడ్డి.. ఈవో పెద్దిరాజు, అధికారులు

Update: 2024-01-10 06:15 GMT

శ్రీశైల దేవస్థానం పరిపాలన భవనంలో ఆలయ ట్రస్ట్ బోర్డ్ సమావేశం 

Srisailam: శ్రీశైలం ఆలయ చైర్మన్ రెడ్డి వారి చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో 22వ ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 57 ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. ప్రాతకాలసేవలో పాల్గొనే భక్తులకు వెండి శివపార్వతుల ప్రతిమను ఇవ్వాలని మండలి నిర్ణయం తీసుకుంది. క్షేత్ర పరిధిలోకి పులులు రాకుండా శివరాత్రిలోపు ఫెన్సింగ్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. భక్తుల సందర్శనకు ఏనుగుల చెరువు, మల్లమ్మ కన్నీరు ఇలా 20 ఎకరాల్లో నందనవనం ఏర్పాటుకు ట్రస్ట్‌ బోర్డ్‌ ఆమోదించింది.

Tags:    

Similar News