Cold Intensity: తెలుగు రాష్ట్రాల్లో పడిపోతున్న ఉష్ణోగ్రతలు… పెరిగిన చలి తీవ్రత, చలికి గజగజ వణుకుతున్న విశాఖ మన్యం
Cold Intensity: పాడేరు 11, అరకు 13, చింతపల్లి 11 డిగ్రీల ఉష్ణోగ్రత
Cold Intensity: తెలుగు రాష్ట్రాల్లో పడిపోతున్న ఉష్ణోగ్రతలు… పెరిగిన చలి తీవ్రత, చలికి గజగజ వణుకుతున్న విశాఖ మన్యం
Cold Intensity: చలి పులి పంజా విసరడంతో విశాఖ ఏజెన్సీ వణికిపోతోంది. పాడేరులో పొగమంచు కురుస్తుండటంతో పట్టపగలే వాహనాల లైట్లు వేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. మన్యం మంచు దుప్పటి కప్పుకుంది. జనం ఇళ్లలో నుంచి బయటకు రావడానికి భయపడిపోతున్నారు. చలిమంటలు వేసుకుని కాలక్షేపం చేస్తున్నారు. పాడేరులో 11, అరకు 13, చింతపల్లిలో 11 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. మిచౌంగ్ తుఫాన్ తర్వాత నుంచి అల్లూరి జిల్లా పాడేరు చలితో గజగజా వణికిపోతూనే ఉంది.