తెలుగు అకాడమీ కేసులో కీలక మలుపు.. ఇకపై కేసు విచారణ...

Telugu Academy: క్రిమినల్ చర్యలతో పాటు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ నిందితులు

Update: 2021-11-27 05:12 GMT

ఏసీబీ చేతికి తెలుగు అకాడమీ కేసు (ఫోటో ది హన్స్ ఇండియా)

Telugu Academy: తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్ కేసు కీలక మలుపు తిరిగింది. ఇప్పటి వరకు దర్యాప్తు చేసిన సీసీఎస్‌ పోలీసులు ఇకపై కేసు విచారణ ఏసీబీ చేతికి అప్పగించనుంది. క్రిమినల్ చర్యలతో పాటు అధికార దుర్వినియోగానికి నిందితులు పాల్పడినట్లు గుర్తించారు.

ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ పీసీ యాక్ట్ కింద విచారణ చేయనుంది ఏసీబీ. 64.5 కోట్లు ఫిక్స్‌డ్ డిపాజిట్లు కాజేసినట్లు గుర్తించారు. వెంకటసాయి కుమార్ సహా 18 మంది నిందితులను అరెస్ట్ చేశారు. తెలుగు అకాడమీ ఏవో రమేష్‌తో పాటు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పాత్ర ఉన్నట్లు తేల్చారు. ప్రభుత్వ బ్యాంక్ అధికారుల పాత్రపై సైతం ఏసీబీ విచారణ చేపట్టనుంది. మూడు ఎఫ్‌ఐఆర్‌ల వివరాలు సీసీఎస్ అధికారులు ఏసీబీకి అందించారు.

Full View


Tags:    

Similar News