Avinash Reddy: అవినాష్‌రెడ్డి పిటిషన్‌ను తిరస్కరించిన తెలంగాణ హైకోర్టు

Avinash Reddy: కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశించేందుకు హైకోర్టు నిరాకరణ

Update: 2023-03-17 05:50 GMT

Avinash Reddy: అవినాష్‌రెడ్డి పిటిషన్‌ను తిరస్కరించిన తెలంగాణ హైకోర్టు

Avinash Reddy: వైఎస్ వివేక హత్య కేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డి వేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. సీబీఐ కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశించేందుకు హైకోర్టు నిరాకరించింది. అరెస్ట్ విషయంలోనూ తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. తనను సీబీఐ విచారించకుండా ఆదేశించాలని.. అవినాష్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ విచారణకు సహకరించాలని హైకోర్టు ఆదేశించింది. అవినాష్‌రెడ్డి సీబీఐ విచారణను వీడియో, ఆడియో రికార్డింగ్ చేయాలని ఆదేశించింది.

Tags:    

Similar News