నేడు టీడీపీ మహిళా కమిటీల ప్రకటన!

సాధారణ ఎన్నికల్లో ఘోర పరాజయంపాలైన తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం సంస్థాగతంగా బలపడాలని ప్రణాళిక రచించింది. అందులో భాగంగా ఏపీలో రాష్ట్ర కమిటీని రద్దు చేసిన..

Update: 2020-10-01 03:27 GMT

సాధారణ ఎన్నికల్లో ఘోర పరాజయంపాలైన తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం సంస్థాగతంగా బలపడాలని ప్రణాళిక రచించింది. అందులో భాగంగా ఏపీలో రాష్ట్ర కమిటీని రద్దు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు.. కొత్తరక్తాన్ని నియమిస్తున్నారు. పార్టీకి  నూతన అధ్యక్షుడిని ప్రకటించాలని భావించి ముందుగా 25 పార్లమెంటు కమిటీలు వేసి వాటిని అధ్యక్షులు, సమన్వయ కర్తలను, ప్రధాన కార్యదర్శులను నియమించారు. తాజాగా 25 పార్లమెంటరీ కమిటీలకు 25 మంది మహిళా అధ్యక్షులు అలాగే మహిళా సమన్వయ కర్తలను, ప్రధాన కార్యదర్శులను కూడా నియమించారు చంద్రబాబు. గురువారం ఇందుకు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మహిళా అధ్యక్షురాళ్ల పేర్లను ప్రకటించనున్నారు చంద్రబాబు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా కృష్ణా జిల్లానుంచి వచ్చాయి. అందరి వినతులు పరిశీలించిన అనంతరం 25 మందిని ఎంపిక చేశారు చంద్రబాబు. అందులో అధ్యక్ష పదవి దక్కని మహిళలకు ప్రధాన కార్యదర్శి పదవులు కట్టబెట్టినట్టు తెలుస్తోంది. ఎక్కువగా బీసీ వైపు మొగ్గుచూపినట్టు తెలుస్తోంది. ఇదిలావుంటే ఇటీవల ప్రకటించిన 25 పార్లమెంటు కమిటీల అధ్యక్షుల పేర్లు ఇలా ఉన్నాయి.

శ్రీకాకుళం- కూన రవికుమార్‌, విజయనగరం- కిమిడి నాగార్జున, అనకాపల్లి- బుద్దా నాగ జగదీశ్వరరావు, అమలాపురం- రెడ్డి అనంతకుమారి, రాజమండ్రి- కొత్తపల్లి జవహర్‌, నర్సాపురం- తోట సీతారామలక్ష్మి ,అరకు- సంధ్యారాణి, విశాఖపట్నం- పల్లా శ్రీనివాసరావు, కాకినాడ- జ్యోతుల నవీన్‌.., ఏలూరు- గన్ని వీరాంజనేయులు , మచిలీపట్నం- కొనకళ్ల నారాయణరావు, విజయవాడ- నెట్టెం రఘురాం ,గుంటూరు- శ్రవణ్‌కుమార్‌, నరసరావుపేట- జీవీ ఆంజనేయులు, బాపట్ల- ఏలూరి సాంబశివరావు, ఒంగోలు- నూకసాని బాలాజీ, నెల్లూరు- అబ్దుల్‌ అజీర్, రాజంపేట- రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి, కడప- లింగారెడ్డి, అనంతపురం- కాల్వ శ్రీనివాసులు, తిరుపతి- నర్సింహయాదవ్‌ , చిత్తూరు- పులవర్తి నాని, హిందూపురం- బీకే పార్థసారధి, కర్నూలు- సోమిశెట్టి వెంకటేశ్వర్లు, నంద్యాల- గౌరు వెంకటరెడ్డి. 

Tags:    

Similar News