బ్రేకింగ్ న్యూస్ : టీడీపీ సీనియర్ నేత ఆత్యహత్యాయత్నం.. మోసపోయానంటూ..

Update: 2020-03-04 06:05 GMT

టీడీపీ సీనియర్ నేత, కర్నూలు మాజీ మేయర్‌ బంగి అనంతయ్య ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. వెంటనే ఆయన్ను చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బంగి అనంతయ్యకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

ఆర్ధిక ఇబ్బందులతోనే ఆత్మహత్యాయ్నత్నం చేశానని బంగి అనంతయ్య తెలిపారు. అధినేత చంద్రబాబు ఆదుకుంటారని నమ్మి మోసపోయానన్నారు. ఆర్థిక సాయం కోసం చంద్రబాబు చుట్టూ పలుసార్లు ప్రదక్షిణలు చేసినా ఫలితం లేకుండా పోయిందని వాపోతున్నారు. తీవ్రమనస్థాపంతో ఆత్మహత్యాయత్నం చేశానంటున్నారు. 

Tags:    

Similar News