ఆ టీడీపీ నేత చెప్పినందుకే ఎన్నికలు వాయిదా వేశారా?

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడిన సంగతి తెలిసిందే.. ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ ప్రకటించారు.

Update: 2020-03-15 11:25 GMT
chandrababu, jagan (File Photo)

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడిన సంగతి తెలిసిందే.. ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ ప్రకటించారు. ఎన్నికలు వాయిదా పడడంతో మీడియా సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్ ఎస్ఈసీ రమేష్ కుమార్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలు ఓట్లేసి 151 సీట్లతో అధికారం మాకు ఇచ్చారని, అధికారం రమేశ్ కుమార్‌దా.. మాదా? అని నిలదీశారు. ఇక సీఎంలు ఎందుకు? ప్రభుత్వం ఎందుకు? అని అన్నారు.

రమేశ్ కుమార్‌‌ను చంద్రబాబే నియమించారని, తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని అన్నారు. రమేశ్ కుమార్ విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని, ఆయన చేసిన వ్యాఖ్యలు బాధకలిగించాయని అన్నారు. కరోనా సాకుతో ఎన్నికలు వాయిదా వేస్తారా అని, బుర్రలో క్లారిటీ ఉండాలి కదా అని జగన్ మండిపడ్డారు..ఇక ఎన్నికలు వాయిదా పడడంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అందులో భాగంగానే టీడీపీ కీలక నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు. "కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజారోగ్యం దృష్ట్యా నేను మీడియా ద్వారా, వ్యక్తిగతంగా ఫోన్ ద్వారా కోరిన వెంటనే స్పందించి స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ గారికి ధన్యవాదములు" అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

  

Tags:    

Similar News