Nara Lokesh: సీఎం జగన్‌కు టీడీపీ నేత నారా లోకేశ్ లేఖ
Nara Lokesh: ప్రభుత్వం ఫ్లెక్సీ పరిశ్రమకు ప్రత్యామ్నాయం చూపించాలి
Nara Lokesh: సీఎం జగన్‌కు టీడీపీ నేత నారా లోకేశ్ లేఖ
Nara Lokesh: సీఎం జగన్‌కు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. కరోనా సంక్షోభంతో తీవ్ర నష్టాన్ని చవిచూసిన ఫ్లెక్సీ ప్రింటింగ్ పరిశ్రమపై.. ప్రభుత్వ హడావిడి నిర్ణయం మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా తయారైందని, లేఖలో తెలిపారు. సంబంధితశాఖ అధికారులతో కనీసం సమావేశం కూడా ఏర్పాటు చేయకుండా ఫ్లెక్సీలు బ్యాన్ చేస్తున్నామని ప్రకటించడంతో 7లక్షలమంది భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి వారికి ప్రత్యామ్నాయం చూపించాలని సీఎం జగన్ ను నారా లోకేష్ కోరారు.