సీఎం జగన్‌ పిచ్చి పీక్స్‌కు వెళ్లింది: టీడీపీ నేతలు

ఒక రాష్ట్రానికి మూడు రాజధానులు అవసరం లేదని టీడీపీ చెబుతోంది.

Update: 2019-12-18 07:36 GMT

ఒక రాష్ట్రానికి మూడు రాజధానులు అవసరం లేదని టీడీపీ చెబుతోంది. దానివలన ఏ ప్రాంతంపై దృష్టిసారించలేమని చెబుతున్నారు. సీఎం జగన్ తుగ్లక్‌ పాలన సాగిస్తున్నారని అన్నారు టీడీపీ నేత నక్కా ఆనందబాబు. ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకే అసెంబ్లీలో సీఎం జగన్‌ మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారని ఆరోపించారు. కర్నూలులో హైకోర్టు చేసేలా ఉద్యమం చేయించింది జగనేనన్నారు. రాజధాని మారుస్తామని ఎన్నికల ముందు చెప్పకుండా ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోవడంలో అర్ధం ఏమిటని అన్నారు.

రాజధానిలో టీడీపీ నేతలే భూములు కొన్నారని వారే అవినీతి చేశారని జగన్ విమర్శిస్తున్నారు.. అలా జరిగితే ఎందుకు చర్యలు తీసుకోలేదని నక్కా ఆనందబాబు సీఎంను నిలదీశారు. అలాగే సీఎం జగన్‌ పిచ్చి పీక్స్‌కు వెళ్లిందని టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ విమర్శించారు. ఆరు నెలలుగా విశాఖలో వైసీపీ ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ కు పాల్పడుతోందని ఆమె ఆరోపించారు. అమరావతిలో రెడ్లు 17శాతం, కమ్మవాళ్లు 14శాతం ఉన్నారనిన్న అనురాధ.. వైసీపీ అధికారంలోకి వచ్చాక రెడ్డి సామాజిక వర్గం వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు.

Tags:    

Similar News