Andhra Pradesh: జనసేనకు టీడీపీ తలనొప్పి

Andhra Pradesh: టీడీపీ, జనసేన, వామపక్షాలు కలిసి పోటీ చేయాలన్న సీపీఐ నారాయణ

Update: 2021-03-07 02:23 GMT
జన సేన (ఫైల్ ఇమేజ్)

Andhra Pradesh: ఏపీలో మున్సిపల్ ఎన్నికల దగ్గరపడుతున్న కొద్దీ పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. జనసేన పార్టీకి టీడీపీ తలనొప్పి వెంటాడుతూనే ఉంది. జనసేన టీడీపీ తో కలుస్తుందని ప్రచారం ఇటీవల జోరుగా సాగుతోంది. ఇప్పుడు ఇదే అంశం ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారింది.. దీనిపై అధినేత స్పదించకపోవడంతో క్యాడర్ అయోమయంలో ఉంది..

ఏపీలో మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో చాలా చోట్ల జనసేన, టీడీపీ మద్దతుదారులు పరస్పర అంగీకారంతో కలిసి పోటీ చేశారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ అక్కడక్కడా జనసేనకు టీడీపీ మద్దతు ఇస్తుంది. దీంతో ఈ రెండు పార్టీలు మళ్ళీ కలుస్తున్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే వీటికి మరికొంత ఆద్యం పోశారు సీపీఐ నారాయణ.. జనసేన టీడీపీ, వామపక్షాలు కలిసి పనిచేయాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో ఇప్పుడు జనసేన, టీడీపీ కలుస్తుందనే టాక్ పొలిటికల్ సర్కిల్ జోరుగా జరుగుతుంది..

అయితే, టీడీపీతో జనసేన కలుస్తుందనే ప్రచారాన్ని జనసేన నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. జనసేనకు వస్తున్న ప్రజాదరణను తట్టుకోలేకే ఇలాంటి ఫేక్ ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్నారు. జనసేన, బీజేపీతో పొత్తులో ఉంది. ఈ రెండు పార్టీలు కలిసి పని చేస్తాయని అధినేత పదేపదే చెప్తున్నారు. అయితే.. కలిసి పోటీ చేస్తాయే తప్ప మరే ఇతర పార్టీలతో కలిసి అవకాశం లేదని జనసేనాని చెప్తున్నారు.

అయితే జనసేనపై జరుగుతున్న ఈ ప్రచారంపై పార్టీ అధినాయకత్వం నుండి ఎలాంటి స్పందన రావడంలేదు.. ఇప్పటికైనా పార్టీ నుండి ఇలాంటి ప్రచారాలపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు జనసైనికులు.

Tags:    

Similar News