వైసీపీకి వరుస షాక్‌లిచ్చిన టీడీపీ.. మంత్రులపై జగన్ వేటు వేస్తారా..?

* 'వై నాట్ 175' అన్న జగన్‌ నెక్ట్స్ స్టెప్ ఏంటి?

Update: 2023-03-24 03:13 GMT

వైసీపీకి వరుస షాక్‌లిచ్చిన టీడీపీ

YSRCP: ఎమ్మెల్సీ ఫలితాలతో వైసీపీ ఆత్మరక్షణలోకి వెళ్లిందా? అంటే అవుననే వినిపిస్తుంది. ప్రతిపక్ష టీడీపీ వరుస షాక్‌లతో వైసీపీకి దెబ్బ మీద దెబ్బ తగిలినట్లు అయింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో 3 టీడీపీ గెలుచుకుంటుందని ఆ పార్టీయే ఊహించలేదు. అలాగే బలం లేకున్నా ఎమ్మెల్యే కోటా బరిలో నిలబడిన టీడీపీ అనూహ్యంగా విజయం సాధించింది. వైసీపీలోనే నలుగురు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడటం తీవ్ర చర్చనీయాంశమైంది. దీంతో వైసీపీలో రెబల్స్ బలం పెరుగుతుందా..? దీనికి బాధ్యులుగా మంత్రులపై జగన్ వేటు వేస్తారా..? కొత్త ఎమ్మెల్సీలకు ఛాన్స్‌ ఇస్తారా..? అంటూ ప్రచారాలు మొదలయ్యాయి.

175కు 175 అసెంబ్లీ స్థానాలు గెలవాలంటూ 'వై నాట్ 175' అంటూ జగన్ టార్గెట్ పెట్టారు. మరి ఎమ్మెల్సీ ఫలితాలతో దేనికి సంకేతాలిచ్చాయి? మరి ఎమ్మెల్సీ ఫలితాలతో దేనికి సంకేతాలిచ్చాయి? ఇప్పటికే సొంత పార్టీలో రెబల్స్ పెరిగిపోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డిలను వైసీపీ వదిలేసుకుంది. ఇప్పుడు కొత్తగా క్రాస్ ఓటింగ్‌లో ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ పేర్లు వినిపిస్తున్నాయి. వీరిద్దరు కూడా క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినట్లు వైసీపీ అనుమానిస్తోంది.

Tags:    

Similar News