టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అధ్యక్షతన అత్యవసర సమావేశం జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశానికి లోక్ సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు ఇతర ముఖ్యనేతలు హాజరయ్యారని సమాచారం. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన విషయంపై ప్రధానంగా చర్చించారు. అలాగే పార్టీనుంచి భారీ ఎత్తున వలసలు ఉన్న నేపథ్యంలో వలసలను నియంత్రించేందుకు వ్యూహాలు రచిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే కృష్ణా జిల్లాలో ఇద్దరు కీలకనేతలు వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్ టీడీపీకి గుడ్ బై చెప్పారు. త్వరలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ప్రకాశం జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, అనంతరపురంకు చెందిన పరిటాల కుటుంబం పార్టీ మారుతారన్న నేపథ్యంలో వారిని బుజ్జగించేందుకు నేరుగా అధినేత చంద్రబాబు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. అసంతృప్తి నేతలతో నేరుగా లోకేష్ ఫోనులో మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది.