హై కోర్టుతో చెప్పించుకోవాలా? స్పృహ ఉండొద్దూ.. సీఎం జగన్‌పై టీడీపీ విమర్శలు

జగన్ సర్కార్‌కు హైకోర్టు షాక్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ కార్యాలయాలకు వేసిన రాజకీయ పార్టీల రంగులను తొలిగించాలని ఏపీ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది.

Update: 2020-03-10 08:35 GMT
Jagan High Court File Photo

జగన్ సర్కార్‌కు హైకోర్టు షాక్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ కార్యాలయాలకు వేసిన రాజకీయ పార్టీల రంగులను తొలిగించాలని ఏపీ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. హైకోర్టు తీర్పుతో ప్రభుత్వంపై టీడీపీ విమర్శలు ఎక్కుపెట్టింది. సోషల్ మీడియా వేదికగా జగన్ ప్రభుత్వంపై విమర్శల దాడిని ప్రారంభించింది.

పారదర్శకంగా ఎన్నికలు జరగాలని నీతులు చెప్పినప్పుడు పంచాయితీ భవనాలకు పార్టీ రంగులు తీసేయాలన్న స్పృహ ఉండొద్దూ! దీనికి కూడా హై కోర్టుతో చెప్పించుకోవాలా? అయినా రంగులేసుకుంటే నీకు ఆనందం కలిగిందేమో కానీ ప్రజలకు పైసా ఉపయోగం ఉందా? పైగా రూ.2800 కోట్ల నష్టం ఎవరు భరించాలి? అంటూ టీడీపీ ట్విట్టర్లో ప్రశ్నించింది.

అంతే కాకుండా రంగులు వేసిన భవనాల ఫోటోలను జోడిస్తూ.. రంగుల సరదా నీది.. ఖర్చు ఖజానాదా.. అంటూ ఓ ఫోటోను షేర్ చేసింది. ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగుల వేయడానికి 1400 కోట్లు రూపాయలు, రంగులు మార్చడానికి మరో 1400 కోట్లు రూపాయలు కావలి. ' ఎవడబ్బ సొమ్మని' అంటూ.. రామదాసు కీర్తన గుర్తు రావట్లేదా అని జగన్ ప్రభుత్వంపై ట్వీట్ల ద్వారా విమర్శలు చేసింది.

పంచాయతీ భవనాలు, ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు తొలిగించి, సీఎస్‌ నిర్ణయం ప్రకారం 10 రోజుల్లో మళ్లీ రంగులు వేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలు అమలు చేసినట్లు ఆధారాలను నివేదిక రూపంలో సమర్పించాలని సీఎస్‌ను హైకోర్టు ఆదేశించింది.



Tags:    

Similar News