వైసీపీ క్రూర రాజకీయానికి కోడెల మృతి ఒక ఉదాహరణ : చంద్రబాబు

కోడెల శివప్రసాద్ రావు ... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున చాలా సార్లు గెలిచి పలు శాఖల్లో మంత్రిగా

Update: 2020-05-02 08:00 GMT
chandrababu (File Photo)

కోడెల శివప్రసాద్ రావు ... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున చాలా సార్లు గెలిచి పలు శాఖల్లో మంత్రిగా పని చేసి ప్రజల్లో చెరగని ముద్రను వేశారు.. 1947 మే 2న గుంటూరు జిల్లాలో జన్మించిన ఆయన 1983 నుంచి 2004 వరకు వరసగా ఐదుసార్లు నరసరావుపేట నుంచి గెలిచారు. ఆ తర్వాత రెండుసార్లు ఓటమిపాలై, 2014లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు సత్తెనపల్లి నుంచి తెలుగుదేశం పార్టీ తరపున గెలుపొందాడు. శాసనసభకు ఆరుసార్లు ఎన్నికైన కోడెల ఎన్.టి.ఆర్, చంద్రబాబు మంత్రివర్గంలో పలు శాఖల్లో పనిచేశారు.

ఈరోజు ఆయన 74వ జయంతి కావడంతో ఈ సందర్భంగా టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు ఆయన సేవల్ని ఒకసారి స్మరించుకున్నారు. ప్రజల కోసం పోరాడే వ్యక్తిత్వం, ఆపన్నులకు అండగా నిలిచి భరోసా ఇచ్చే గుండె ధైర్యం కోడెల శివప్రసాద్ గారి సొంతం. ఈ లక్షణాలే రూపాయి డాక్టరుగా పేదలకు వైద్య సేవలందిస్తోన్న కోడెలను ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రమ్మని పిలిచేలా చేశాయి. ప్రజల్లో కోడెలను పల్నాటి పులిగా నిలిపాయనీ చంద్రబాబు అన్నారు.

అంతేకాకుండా అలాంటి వ్యక్తి కుటుంబంపై 19 కేసులు పెట్టి, వైసీపీ నేతలంతా కాకుల్లా పొడుచుకుతిన్నారు. మానసికంగా కృంగదీసి ఆత్మహత్యకు పాల్పడేలా చేసారు. వైసీపీ క్రూర రాజకీయానికి కోడెల మృతి ఒక ఉదాహరణ. ఈరోజు కోడెల శివప్రసాద్ గారి జయంతి సందర్భంగా ఆయన ప్రజాసేవలను మననం చేసుకుందామని చంద్రబాబు పేర్కొన్నారు.



 


Tags:    

Similar News