Chandrababu: సీఐడీ నోటీసులపై ఏపీ హైకోర్టుకు చంద్రబాబు

Chandrababu: సీఐడీ నోటీసులపై హైకోర్టుకు వెళ్లే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది.

Update: 2021-03-17 05:04 GMT

చంద్రబాబు (ఫైల్ ఫోటో )

Chandrababu: సీఐడీ నోటీసులపై హైకోర్టుకు వెళ్లే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. నిన్న న్యాయనిపుణులతో సమావేశమైన చంద్రబాబు.. వారి వద్ద నుంచి సలహాలు తీసుకున్నారు. చంద్రబాబు రేపు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. తనపై నమోదైన కేసుకు సంబంధించిన.. ఎఫ్‌ఐఆర్‌ కొట్టివేయాలని కోరనున్నట్లు సమాచారం.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పేరుతో పెద్ద ఎత్తున్న భూకుంభకోణానికి తెర తీశారని తెలుగుదేశం అధినేత,నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. విజయవాడ నుంచి మంగళవారం ఉదయం 8 గంటలకు రెండు బృందాలుగా హైదరాబాద్ వచ్చిన సీఐడీ అధికారులు జూబ్లిహిల్స్‌లోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన సీఐడీ అధికారులు రాజధానిలో అసైన్డ్‌ భూముల కొనుగోళ్లు, అమ్మకాల విషయంలో విచారణకు సంబంధించి నోటీసులు అందజేశారు. చంద్రబాబుతో పాటు మరో కీలక నేత, మాజీ మంత్రి పొంగూరు నారాయణకు కూడా సీఐడీ నోటీసులు ఇచ్చారు.

ఈ కేసులో విచారణకు హాజరు కావాల్సిందిగా 41 సీఆర్పీసీ కింద చంద్రబాబుకు నోటీసులు ఇచ్చినట్టు సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ తెలిపారు.మార్చి 23న తమ ముందు హాజరై పూర్తి వివరాలు అందించాలని ఏపీ సీఐడీ అధికారులు చంద్రబాబునాయుడ నోటీసులు జారీ చేశారు.

Tags:    

Similar News