Andhra Pradesh: అమిత్ షాను కలిసేందుకు టీడీపీ, వైసీపీ ప్రయత్నాలు
Andhra Pradesh: పరస్పరం ఫిర్యాదులు చేసుకునేందుకు నేతల యత్నం
అమిత్ షాను కలిసేందుకు ప్రత్నాలు చేస్తున్న వైసీపీ మరియు టీడీపీ (ఫైల్ ఇమేజ్)
Andhra Pradesh: ఏపీలో తిట్ల రాజకీయాలు నెక్ట్స్ లెవెల్ కు చేరుకున్నాయి. మొన్నటి పట్టాభి ఎపిసోడ్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలసి ఫిర్యాదు ఇచ్చేందుకు టీడీపీ, వైసీపీ పోటా పోటీగా ప్రయత్నాలు చేస్తున్నాయి. అమిత్ షాతో భేటీకోసం టీడీపీ మొన్నటినుంచే ప్రయత్నిస్తోంది. చంద్రబాబు రెండురోజులు ఢిల్లీలో ఉన్నా అమిత్ షా అపాయింట్ మెంట్ దొరక్క పోవడంతో టీడీపీ బృందం నిన్న హైదరాబాద్ కు వెనుదిరిగింది.
మరో వైపు పట్టాభి ఎపిసోడ్ పై కంప్లయింట్ చేసేందుకు వైసీపీ కూడా రంగంలోకి దిగింది. హోంశాఖ కన్సల్టెటివ్ కమిటీ సమావేశంలో అమిత్ షాను కలసిన వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ పట్టాభి పరుష పదజాలంపై కంప్లయింట్ చేసినట్లు సమాచారం రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారిపై అసభ్య పదజాలాన్ని వినియోగిస్తున్న వారిపై చర్యలు తీసుకునేలా చట్టాలను కఠినతరం చేయాలని కోరినట్లు తెలుస్తోంది.