Raghu Rama Krishna Raju: రఘురామకృష్ణరాజు పై సుప్రీంకోర్టు సీరియస్
Raghu Rama Krishna Raju:వైఎస్ జగన్‌పై కేసులను వేగవంతంగా విచారించాలని రఘురామకృష్ణంరాజు తరపు న్యాయవాది సుప్రీంకోర్టును కోరారు.
Pay Scale: ఉద్యోగుల పేస్కేల్ తగ్గించడం..శిక్షనాత్మక చర్యలతో సమానం..ప్రభుత్వ నిర్ణయంపై సుప్రీం అసహనం
Supreme Court: రఘురామ కృష్ణంరాజుపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. వైఎస్ జగన్‌పై కేసులను వేగవంతంగా విచారించాలని రఘురామకృష్ణంరాజు తరపు న్యాయవాది సుప్రీంకోర్టును కోరారు. తాము ఏ పని ఎప్పుడు చేయాలో మీరు డిక్టేట్ చేయొద్దని రఘురామ కృష్ణంరాజు న్యాయవాదిపై జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు.
రఘురామపైనే సీబీఐ కేసులు ఉన్నాయని. సీనియర్ అడ్వకేట్ నిరంజన్ రెడ్డి వాదనల సందర్భంగా ప్రస్తావించారు. కేసులు విచారణ ట్రయల్ కోర్టులే చూసుకుంటాయని.. జస్టిస్ సంజీవ్ ఖన్నా వెల్లడించారు. అన్ని తామే కంట్రోల్ చేయాలంటే. వందల కేసులు ఉంటాయని.. తెలిపారు.
ఈ కేసులో గతంలో తాము ఇచ్చిన ఆదేశాలు అమలవుతాయని కోర్ట్ వ్యాఖ్యానించింది. తదుపరి విచారణ నవంబర్ కు వాయిదా వేసింది.